'శ్రీకారం' లాంటి చిత్రంలో నటించడం ఒక కథానాయకుడిగా తనకెంతో గర్వంగా ఉందని యువ నటుడు శర్వానంద్ అన్నారు. ఒక బాధ్యతగా భావించి రైతు కథను ఎంపిక చేసుకోవడం జరిగిందన్న ఆయన... రామ్ చరణ్ సూచించడం వల్లే 'శ్రీకారం' చేశానని స్పష్టం చేశారు.
14రీల్స్ ప్లస్ పతాకంపై యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శర్వానంద్ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమై వేడుకలను నిర్వహించారు. భూమికి మనిషికి మధ్య జరిగే ప్రేమకథ తమ సినిమాగా పేర్కొన్న చిత్ర యూనిట్.. ఈ నెల 8న ఖమ్మంలో జరిగే ముందస్తు విడుదల వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, 9న హైదరాబాద్ లో జరిగే వేడుకల్లో కేటీఆర్ హాజరవుతారని శర్వానంద్ తెలిపారు. శర్వానంద్ సరసన గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక అరుల్ కథానాయికగా నటించగా రావురమేష్, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదీ చూడండి: శర్వానంద్ నుంచి వరుస సర్ప్రైజ్లు