Sarkaru Vaari Paata Release Date: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారిపాట'. కీర్తి సురేశ్ కథానాయిక. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఫుల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న పోస్టర్ మహేశ్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబు బ్యాంకు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
![new movie posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14604317_2.jpg)
రవితేజ 'రామారావు' టీజర్
Ravi Teja Ramarao on Duty: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 25న గానీ, పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 15న గానీ రిలీజ్ చేస్తామని తెలిపింది చిత్రబృందం.
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్ మాండవ దర్శకత్వం వహిస్తుండగా.. దివ్యాంశ కౌషిక్ హీరోయిన్గా నటిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అలా పార్కులో సరదాగా..
RRR Release Date: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని ఓ వర్కింగ్ స్టిల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ స్టిల్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫోన్లు చూసుకుంటూ పార్కులో పడుకుని ఉన్నారు. షూటింగ్ బ్రేక్‌లో ఇద్దరూ తమ ఫోన్లలో నిమగ్నమయ్యారు.
ఈ చిత్రం మొదట జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా కొవిడ్ వల్ల వాయిదా పడింది. అయితే మార్చి 7న థియేటర్లలోకి తీసుకురావాలని చూసినా.. ఒమిక్రాన్ కేసుల కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![new movie posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14604317_1.jpg)
దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. అజయ్ దేవగణ్, ఆలియా భట్, శ్రియ కీలక పాత్రలో నటించారు.
సూర్య 'ఈటి'
![new movie posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14604317_8.jpg)
Etharkum Thuninthavan Movie Release Date: 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్' చిత్రాలతో వరుస హిట్లు కొట్టారు హీరో సూర్య. ఇప్పుడు 'ఈటి' చిత్రంతో వెండితెరపై సందడిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈటి చిత్రం మార్చి 12 న విడుదల కానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ బుధవారం సందడి చేయనుంది.
ఆది కొత్త సినిమా పోస్టర్..
![new movie posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14604317_4.jpg)
Aadi CSI Movie: హీరో ఆది నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. సీఎస్ఐ సనాతన్ అనే థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
'ది వారియర్'లో ఆది పినిశెట్టి
![new movie posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14604317_3.jpg)
Ram the warrior movie: హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆది కోపంతో రగిలిపోతూ ఉన్నట్లుగా పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
హన్సిక కొత్త లుక్..
![new movie posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14604317_10.jpg)
Hansika motwani latest movie: హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మై నేమ్ ఈజ్ శ్రుతి'. ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా, బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది.
హే! సినామిక కొత్త పోస్టర్..
![new movie posters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14604317_5.jpg)
Hey sinamika movie release date: దుల్కర్ సల్మాన్ 'హే! సినామిక' చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి3న విడుదలకు సిద్ధమైంది.
ఇదీ చూడండి: