ETV Bharat / sitara

'సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారు' - సరిలేరు నీకెవ్వరు ఆంథమ్

మహేశ్ బాబు, రష్మిక ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాలోని ఆంథమ్ సాంగ్​ ఫుల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

సరిలేరు నీకెవ్వరు
సరిలేరు నీకెవ్వరు
author img

By

Published : Mar 17, 2020, 8:19 PM IST

"సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారు" అంటూ భారత సైనికుల త్యాగాన్ని పాట రూపంలో తెలియజేశాడు దేవీశ్రీ ప్రసాద్‌. మహేశ్ బాబు కథానాయకుడిగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని గీతమిది. స్వీయ సంగీత దర్శకత్వంలో డీఎస్పీ రచించిన ఈ పాట ప్రతి ఒక్కరిని హత్తుకుంది. దేశం పట్ల స్ఫూర్తిని నింపింది.

తాజాగా ఈ ఆంథమ్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. శంకర్‌ మహదేవన్‌ ఆలపించిన ఈ గీతం లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఫుల్‌ వీడియో అత్యంత వీక్షణలు సొంతం చేసుకుంటుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో మహేశ్ సరసన రష్మిక నటించింది. ప్రముఖ నటి విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.