ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ నిర్మించిన మరాఠీ చిత్రం 'బాబా'.. గోల్డెన్ గ్లోబ్స్ విదేశీ భాషా విభాగంలో ఉత్తమ మోషన్ పిక్చర్‌గా ఎంపికైంది. వచ్చే ఏడాది ప్రదర్శించనున్నారు. ఆర్.రాజ్.గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది.
కథేంటి..?
చెవిటి, మూగ దంపతులు ఓ బాలుడిని తెచ్చి పెంచుకుంటారు. అయితే పుట్టగానే పిల్లాడ్ని వదిలేసిన అతడి సొంత తల్లి, బాబును తిరిగి ఇవ్వాలంటూ కోర్టుకు వెళుతుంది. ఈ కారణంతో ఆ దంపతులు ఇద్దరూ జైలుపాలవుతారు. ఆ తర్వాత ఏమైందనేదే ఈ చిత్ర కథాంశం. సున్నితమైన ఈ కథను తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
తన భార్య మాన్యతా దత్తో కలిసి సంజూ.. 'బాబా'ను నిర్మించాడు. గోల్డెన్ గ్లోబ్స్‌లో స్క్రీనింగ్‌కు చిత్రం ఎంపిక కావటంపై ఆనందం వ్యక్తం చేసింది మాన్యత.
'ఇలాంటి మంచి సినిమాలు తీయటమే మా లక్ష్యం. ప్రేక్షకులు మా చిత్రాలకు మరింత మద్దతిస్తారని ఆశిస్తున్నాం. అందమైన గ్రామంలో తీసిన 'బాబా' ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది'. -మాన్యత దత్, నిర్మాత
టాలీవుడ్ హిట్ చిత్రం 'ప్రస్థానం' రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నాడు సంజయ్ దత్. ఇప్పటికే విడుదలైన టీజర్ వీక్షకులను అలరిస్తోంది.
ఇదీ చూడండి: 'వాల్మీకి' సెట్స్‌లో ఆస్కార్ సినిమాటోగ్రాఫర్