ETV Bharat / sitara

క్యాన్సర్​ను జయించిన సంజయ్ దత్ - సంజయ్ దత్ కేజీఎఫ్ 2

ఊపిరితిత్తుల క్యాన్సర్​ను జయించానని ప్రముఖ నటుడు సంజయ్ దత్ ప్రకటించారు. తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Sanjay Dutt 'happy to come out victorious' from cancer battle
క్యాన్సర్​ను జయించిన సంజయ్ దత్
author img

By

Published : Oct 21, 2020, 4:04 PM IST

బాలీవుడ్​ ప్రముఖ నటుడు సంజయ్ దత్.. ప్రాణాంతక క్యాన్సర్​ను జయించినట్లు వెల్లడించారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. తన పిల్లల(సారన్, ఇక్రా) పుట్టినరోజున వ్యాధి నుంచి బయటపడటం వారికి ఇస్తున్న ఉత్తమమైన బహుమతి అని అన్నారు.

అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం తీసుకోనున్నానని ఆగస్టులో సంజయ్ దత్ ప్రకటించారు. దీంతో ఆయనకు క్యాన్సర్ సోకిందని, త్వరలో విదేశాలకు వెళ్లనున్నారని నెటిజన్లు చర్చించుకున్నారు. వాటన్నింటికీ చెక్​ పెడుతూ ఇటీవలే ఆ విషయమై స్పష్టతనిచ్చారు. తనకు క్యాన్సర్​ సోకిన మాట నిజమేనని, దానిని జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యాధి నుంచి బయటపడ్డారు.

గత నెలలో 'సడక్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంజయ్.. 'కేజీఎఫ్ 2'లో అధీరా పాత్ర షూటింగ్​ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంతోనే కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.