ETV Bharat / sitara

'అవును.. సంజయ్​దత్​కు లంగ్​ క్యాన్సర్​ ఉంది' - సంజయ్​ దత్​ భార్య మానయతా దత్​

బాలీవుడ్​ నటుడు సంజయ్ ​దత్.. ఊపిరితిత్తుల క్యాన్సర్​తో బాధపడుతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు అతని భార్య మానయతాదత్​. ప్రస్తుతం సంజయ్​కు ప్రాథమిక చికిత్స పూర్తయిందని పేర్కొన్నారు. మరోసారి ట్రీట్​మెంట్​ కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.

Sanjay Dutt fights cancer: We'll emerge as winners, says Maanayata Dutt
'సంజు..తన కెరీర్​లో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు'
author img

By

Published : Aug 19, 2020, 1:05 PM IST

హిందీ నటుడు సంజయ్​దత్​ ఆరోగ్యంపై ఆయన భార్య మానయతాదత్​ ఓ అధికారిక ప్రకటన చేశారు. ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్​తో బాధపడుతన్నట్లు స్పష్టం చేశారు. ఇటీవలె ముంబయిలోని కోకిలాబెన్​ ఆస్పత్రిలో సంజయ్​కు ప్రాథమిక చికిత్స జరిగిందని తెలిపారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మానయతా స్పష్టం చేశారు.

"సంజు అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. మీరు ఇన్నేళ్లుగా ఆయనపై చూపించిన ప్రేమకు కేవలం ధన్యవాదాలతో సరిపెట్టలేను. సంజు తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నాడు. కానీ, ప్రతి కఠినమైన దశలోనూ మీ మద్దతు, ప్రశంసలను మీరు ఎప్పుడూ కొనిసాగిస్తున్నారు. మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉంటాం. ప్రస్తుతం మరో సవాలు మనల్ని పరీక్షించనుంది. ఇప్పుడూ సంజుపై అలాంటి ప్రేమాభిమానులే మళ్లీ కావాలని కోరుకుంటున్నా. ఈ సమయంలో దురదృష్టవశాత్తు నేను ఇంట్లోనే నిర్బంధం అవ్వాల్సి వచ్చింది. కొన్ని రోజుల్లో క్వారంటైన్​ ముగుస్తుంది. సంజు ఇటీవలె కోకిలాబెన్​ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సను పూర్తి చేసుకున్నాడు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చికిత్స కోసం మేము విదేశాలకు వెళ్లడానికి ప్రణాళిక చేసుకుంటాం. దీనిపై ఊహాగానాలను ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. సంజయ్​ ఆరోగ్య సమాచారాన్ని క్రమం తప్పకుండా మీకు చేరవేస్తాను".

-మానయతా దత్​, సంజయ్​ దత్​ భార్య

శ్వాస సంబంధిత సమస్యలతో ఇటీవలె ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్​ నటుడు సంజయ్​దత్​.. చికిత్స కోసం సినిమాలకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. తను ఊపిరితిత్తులు కాన్సర్​తో బాధపడుతున్నట్లు సంజయ్​దత్​, అతని కుటుంబ సభ్యులు వెల్లడించనప్పటికీ.. పరిశ్రమకు చెందిన కోమల్​ నహ్తా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.