నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించబోతున్నాడా? ప్రస్తుతం ఇదే అంశం చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు విషయం ఏంటంటే?
బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం అభిమానుల్లో అంచనాలు పెరుగుతాయి. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.
ప్రస్తుతం బాలకృష్ణ 'రూలర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాతే బోయపాటి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది.
ఇవీ చూడండి.. మహేశ్ మేనల్లుడి చిత్రానికి రంగం సిద్ధం