'దిల్ బెచారా' హీరోయిన్ సంజనా సంఘి.. సుశాంత్ విషయంలో తనపై ప్రశ్నలు సంధించిన నటి కంగనా రనౌత్‌కు దీటుగా సమాధానం చెప్పింది. తన గురించి తప్పొప్పులు మాట్లాడే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.

"సుశాంత్ నాపై అత్యాచారం చేశాడని వచ్చిన ఆరోపణలపై నేనెప్పుడో స్పందించా. ఈ విషయానికి సంబంధించి ఎంతవరకు మాట్లాడాలో నాకు తెలుసు. నా స్పందనపై మరొకరికి తీర్పు ఇచ్చే అధికారం లేదు."
-సంజన, నటి
2018లో సంజనపై సుశాంత్ అత్యాచారానికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జులై 22న కంగనా.. ట్విట్టర్ వేదికగా సదరు నటి ఈ విషయంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఎందుకు ఇంత సమయం తీసుకుందో తెలియజేయాలని అడిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కంగన వ్యాఖ్యలపై సంజన మాట్లాడింది.
సుశాంత్-సంజనా సంఘి కలిసి నటించిన 'దిల్ బెచారా' ఈరోజు (జులై 24) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. వీరి నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది చూడండి : 'సుశాంత్ విషయమై సంజన ఎందుకు మాట్లాడట్లేదు'