చిన్న పిల్లలతో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా కూడా ఓ బాబుతో సరదాగా గడిపింది. అతనెవరో కాదు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తనయుడు ఇజాన్ మీర్జా మాలిక్.
"ఇజాన్ని తినేయాలని ఉంది. కానీ నా చేతిని తినడానికి ఇజ్జుకి అనుమతి ఇచ్చా. సానియా ఇతడిని నేను ఎల్లప్పుడూ ఉంచుకోవచ్చా".. అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది పరిణీతి.
పరిణీతి ఒడిలో కూర్చుని.. ఆమె చేతిని తినడానికి ప్రయత్నిస్తున్న ఓ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది ఈ బాలీవుడ్ నటి.
ఇవీ చూడండి..'బాస్కెట్బాల్'లో ఈ రోబోతో పోటీ పడగలరా!