ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసు: విచారణలో తనీష్ కన్నీటి పర్యంతం​

బెంగళూరు డ్రగ్స్ కేసులో భాగంగా ఇటీవల విచారణకు హాజరైన హీరో తనీష్​.. ఆ సమయంలో కన్నీటి పర్యంతమైనట్లు తెలిపారు అధికారులు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు వెల్లడించారు.

tanish
తనీష్​
author img

By

Published : Mar 25, 2021, 4:15 PM IST

Updated : Mar 25, 2021, 9:06 PM IST

బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సినీ నిర్మాత శంకర్‌గౌడ విషయమై టాలీవుడ్​ హీరో తనీష్​ను ఇటీవల అక్కడి పోలీసులు విచారించారు. ఈ విచారణ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమైనట్లు తెలిపారు అధికారులు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.

"ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నిర్మాత శంకర్​ గౌడ నివాసంలో ఆయన ఇచ్చిన పార్టీకి ఒకసారి మాత్రమే హాజరయ్యా. నాకు మీరు నోటీసులు పంపించడం వల్ల నేను ఒప్పుకొన్న కొత్త సినిమాలు ఆగిపోయాయి. దయచేసి విచారణ పేరుతో మళ్లీ నన్ను పిలవొద్దు. శంకర గౌడ కన్నడలో సినిమాలు నిర్మిస్తారు. ఓసారి హైదరాబాద్​లో కలిసి 'నీతో కన్నడలో సినిమా చేస్తా' అన్నారు. ఆయనతో టచ్​లో ఉంటే నాకు అవకాశాలు వస్తాయని భావించాను. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశాను. ఆయన ఇచ్చిన పార్టీకి ఓ సారి హాజరయ్యాను."

-విచారణలో తనీష్

మాదక ద్రవ్యాల కేసు విచారణలో భాగంగా బెంగళూరు పోలీసులు తనీష్‌తోపాటు మరో ముగ్గురుని విచారణకు రావాలని అంతకుముందు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మార్చి 17న బెంగళూరులోని గోవిందపుర పోలీస్​ స్టేషన్​లో తనీష్​ను అధికారులు విచారించారు. ఆ విచారణలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: బెంగళూరు డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: తనీష్​

Last Updated : Mar 25, 2021, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.