ETV Bharat / sitara

ఆ ఇంటిని ఖాళీ చేసిన సమంత.. లగేజీ సర్దుకుని అక్కడకు షిఫ్ట్​! - యశోద సెట్​లో సమంత

Samantha Yasodha movie: సమంత సినిమాలు చేయడంలో జోరు పెంచారు. క్షణం తీరిక లేకుండా షూటింగ్​కు హాజరవుతున్నారు. ఇప్పటికే రెండు భారీ సినిమాల్లో నటిస్తున్న ఆమె.. ప్రస్తుతం ఇంట్లో కంటే ఓ ప్లేస్​లో ఎక్కువ ఉంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు​ అంటున్నాయి.

Samantha
సమంత
author img

By

Published : Mar 18, 2022, 1:55 PM IST

Samantha Yasodha movie: సమంత.. ఫుల్​ బిజీగా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా..' సాంగ్​తో ఇటీవల సెన్సేషన్​ సృష్టించారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు లేడీ ఓరియెంటెడ్​ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యశోద. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ విషయం ఏంటంటే?

సమంత.. 'యశోద' అనే సైంటిఫిక్ థ్రిల్లర్​లో నటిస్తున్నారు. పాన్ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మూడో వంతు భాగాన్ని లగ్జరీ హోటల్​లో తీయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో 35-40 రోజులు స్టార్ హోటల్​లో షూటింగ్ చేయడం కష్టమైన విషయం! అందుకే దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి మూడు నెలలల్లో లగ్జరీ హోటల్​ సెట్​ను తీర్చిదిద్దారు. ఇందుకోసం 200 మందికిపైగా కష్టపడ్డారు.

sets of Yashoda
మూడు కోట్లతో రూపొందించిన యశోద మూవీ సెట్

ప్రస్తుతం ఎక్కువ భాగం షూటింగ్​ అంతా ఆ సెట్​లోనే జరుగుతోంది. సమంతకు ఆ సెట్​ తెగ నచ్చేసిందంట. దీంతో ఉన్న ఇంటిని ఖాళీ చేసి మరీ సెట్​లో సినిమా ఆయ్యేంత వరకు సెటిల్​ అవ్వాలని చూస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్​ నడుస్తోంది. ఇదే విషయాన్ని నిర్మాతలకు చెప్పి, ఆ సెట్​లో ఉండేందుకు సరిపడా సరంజామాను సర్దుకుని వెళ్లినట్లు సన్నిహితులు చెప్తున్నారు.

sets of Yashoda
యశోద మూవీ సెట్

వరలక్ష్మీ శరత్ ​కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్​ను ఏప్రిల్​ కల్లా పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేసవిలో రిలీజ్​కు ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు. హరి-హరీశ్ దర్శక ద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.

ఇదీ చూడండి:

ఆర్​ఆర్​ఆర్​ ప్రీమియర్​ షోకి ప్రభాస్​.!

'శ్రీవల్లి'ని వాయించిన ముంబయి పోలీసులు

చరణ్​ నువ్విస్తే విషమైనా తాగుతా: ఎన్​టీఆర్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.