నాలుగు సంవత్సరాల వివాహబంధానికి నాగచైతన్య, సమంత ముగింపు (Chaysam Divorce) పలకడం ఇప్పటికీ అభిమానులకు షాకింగ్‌గానే ఉంది. వారి విడాకులకు గల కారణాలపై అనేక ఊహాగానాలు వెలువడుతూనే ఉన్నాయి. సినిమాల్లో సమంత (Samantha Akkineni News) బోల్డ్ సన్నివేశాల్లో నటించడం.. అక్కినేని కుటుంబానికి నచ్చలేదని, పిల్లల్ని కనే అంశంపై దంపతుల మధ్య భేదాభిప్రాయాల వల్ల విడిపోయారని కథనాలు వచ్చాయి. వీటిపై సమంత, చైతన్య స్పష్టతనివ్వలేదు.
అయితే కుటుంబానికి సమంత అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఫ్యామిలీ కోసమే అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వదులుకుందని ఆమె స్నేహితురాలు, మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ కూడా ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సమంత ఓ భారీ ప్రాజెక్టును వదులుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌తో అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో (Shahrukh Khan New Movie News) హీరోయిన్గా తొలుత సమంతనే అనుకున్నారట. అందుకోసం ఆమెను సంప్రదించగా.. చైతో పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ ఆఫర్‌ను కాదనుకుందని తెలుస్తోంది.
అనంతరం హీరోయిన్ పాత్ర కోసం నయనతార ఎంపికైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. కాగా, డ్రగ్స్ కేసులో కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టు కారణంగా షూటింగ్‌ను షారుక్ ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం'(Samantha Sakuntalam Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్.
ఇదీ చూడండి: మరో వెబ్ సిరీస్‌కు సమంత గ్రీన్ సిగ్నల్!