వారాంతంలో రైతులతో కలిసి వ్యవసాయం చేయడం సరికొత్త ఆలోచన అని, తానూ ఒకసారి ప్రయత్నించి చూస్తానని అంటోంది సమంత. బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. పలు ఆసక్తిక విషయాలు పంచుకుంది. ఆ విశేషాలేంటో సామ్ మాటల్లోనే.
ఇది న్యూట్రిషిన్ వీక్. మీరు చేస్తున్న పట్టణ వ్యవసాయం గురించి చెప్పండి!
సమంత: ప్రస్తుతం పట్టణాల్లో మొక్కలు పెంచడం చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో మన కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని మనమే పండించుకోవాలి. అప్పుడే కొంతైనా సమస్యలు తీరతాయి.
'ఏకమ్' ఏర్పాటు చేయడానికి మీకు స్ఫూర్తి ఏంటి?
సమంత: భవిష్యత్ తరాల కోసం దీన్ని ఏర్పాటు చేశాం. చదువు అనేది కేవలం పట్టా కోసం మాత్రమే కాదు. చిన్న వయసులోనే పిల్లల పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కావాలి. అన్ని విషయాలపై అవగాహన కలిగించడమే దీని ఉద్దేశం.
మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి పాటించే ఆహాయ నియమాలు ఏవి?
సమంత: నా డైట్ చాలా సింపుల్‌గా ఉంటుంది. మాంసాహారం, పాల ఉత్పత్తులు తీసుకోను. కేవలం కూరగాయలు, అన్నం మాత్రమే తింటా.
మీ జీవితంలో ఏ విషయంలో ఎక్కువగా కృతజ్ఞతా భావంతో ఉన్నారు?
సమంత: ఉదయం నిద్రలేవడంతోనే ఆ రోజుకు నేను కృతజ్ఞత చెబుతా. నేను జీవించే ప్రతి క్షణానికి కృతజ్ఞత భావంతో ఉంటా.
మీ జీవితంలో మెరుగు పరుచుకున్న మూడు అలవాట్లు ఏంటి?
సమంత: ఆహార నియమాలు, యోగా, మెడిటేషన్
ఇప్పటివరకూ మీ జర్నీ ఎలా సాగింది. కొత్తగా చిత్ర పరిశ్రమకు వచ్చే వాళ్లకు మీరిచ్చే సందేశం ఏంటి?
సమంత: ఒక నటిగా ఇంకా నేను ఎదగలేదనిపిస్తుంది. అయితే, ఇండస్ట్రీలో ఉండటం నా అదృష్టం.
ఇప్పటికే మీరు వ్యవసాయం చేస్తున్నారు. వారంతంలో రైతులతో కలిసి వ్యవసాయం చేయొచ్చుగా?
సమంత: వారాంతంలో రైతులతో కలిసి వ్యవసాయం చేయడం నిజంగా మంచి ఆలోచన. దీని గురించి తప్పకుండా ఆలోచిస్తా.
చివరిగా సారిగా మీరు ఎప్పుడు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు?
సమంత: మూడు రోజుల కిందట 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ చూసి కన్నీళ్లు ఆగలేదు.
మీరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు?
సమంత: మెడిటేషన్ చేస్తా. లాక్‌డౌన్‌లో మరింత దృఢంగా మారా. అందరూ చేయండి. కచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు.
ఈ ఏడాది పూర్తయ్యేలోపు మీరు పూర్తి చేయాలనుకుంటున్న మూడు పనులు ఏంటి?
సమంత: 2020లో నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. అదే నా బెస్ట్ ప్లాన్.
-
2020 is the year of 'no plan is the best plan’ https://t.co/l4uYOSaDI1
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">2020 is the year of 'no plan is the best plan’ https://t.co/l4uYOSaDI1
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 2, 20202020 is the year of 'no plan is the best plan’ https://t.co/l4uYOSaDI1
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 2, 2020