'గీత గోవిందం'.. అనగానే విజయ్ దేవరకొండ-రష్మిక జోడి గుర్తొస్తుంది. అంతగా ఆ పాత్రల్ని తెరకెక్కించాడు దర్శకుడు పరశురామ్. అందులో వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా వచ్చినా, దాదాపు రూ.100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. సినీ అభిమానులు, చిత్ర పరిశ్రమ దృష్టి.. డైరక్టర్ పరశురామ్‌పై పడింది. తర్వాత ఏం చేస్తున్నాడా? అంటూ ఆసక్తి చూపారు. ప్రభాస్, మహేశ్ పేర్లు వినిపించినా, చివరికి నాగచైతన్య.. తన తదుపరి ప్రాజెక్టులో నటించనున్నాడని ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది.
ఇందులో చైతూ సరసన సమంత నటించబోతుందని సమాచారం. 'గీత గోవిందం'లా ఇదీ చక్కని ప్రేమకథ అని, అందులోని పాత్రలు ఎంతగా అలరించాయో అదే తరహాలో ఇప్పుడూ ఆ మ్యాజిక్ రిపీట్ చేయనున్నాడట పరశురామ్. ఇప్పటికే సమంతతో చర్చలు సాగాయని, గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇదే నిజమైతే.. సామ్-చైతూ కాంబినేషన్లో వచ్చే ఐదో సినిమా అవుతుంది.
ఇది చదవండి: ఆ సీన్లు చేయడం చైతూకు కష్టమే: సమంత