కరోనా కారణంగా తన 55వ జన్మదిన వేడుకను నిరాడంబరంగా చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. తన పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో కటుంబసభ్యులు, చిత్రసీమకు చెందిన సన్నిహితుల మధ్య ఆదివారం ఈ వేడుకను జరుపుకొన్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన పుట్టినరోజును పురస్కరించుకుని ముంబయిలోని తన ఇంటి ముందు ఎవరూ గుమికూడవద్దని అభిమానులను కోరారు సల్మాన్. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా వేలాది మంది అభిమానులు శుభాకాంక్షలు చెప్పేందుకు బాంద్రాలోని సల్మాన్ నివాసం దగ్గరకు వస్తారు. ఈసారి తాను అక్కడ లేనని, కరోనా నేపథ్యంలో ఎవరూ అక్కడికి రావొద్దని కోరారు.
![salman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10020696_zxc.jpg)
"ఎన్నో ఏళ్లుగా నా పుట్టినరోజున మీరు, నా ఇంటి దగ్గరకు వచ్చి ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎవరూ అక్కడ గుమికూడవద్దు. మాస్కు పెట్టుకోండి. శానిటైజ్ చేసుకోండి. అందరూ సామాజిక దూరం పాటించండి. నేను అపార్టుమెంటులో లేను. ధన్యవాదాలు" అని సల్మాన్ అన్నారు. త్వరలోనే 'రాధే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకుడు.
![salman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10020696_xzc.jpg)