ETV Bharat / sitara

'బిగ్​బాస్' కొత్త సీజన్​తో సల్మాన్​ ఖాన్ సిద్ధం​ ​ - latest bigboss reality show news

హిందీ బిగ్​బాస్​ కొత్త సీజన్​తో సల్మాన్​ ఖాన్ త్వరలో​ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో షో సెట్స్​పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

bigboss
బిగ్​బాస్
author img

By

Published : Aug 9, 2020, 9:34 PM IST

బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ఖాన్​ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాలిటీ షో 'బిగ్​బాస్'​ ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, మరో సీజన్​తో సల్మాన్​ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాతలు తెలిపారు.

ఇటీవలే షోకు సంబంధించిన ప్రోమోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది కలర్స్​ టీవీ. సల్మాన్​కు చెందిన పన్వెల్​ ఫామ్​హౌస్​లో దీనిని చిత్రీకరించారు. ఇందులో భాయ్​జాన్ వ్యవసాయం చేస్తూ కనిపించాడు. "ప్రతి ఒక్కరి జీవన ప్రయాణానికి లాక్​డౌన్ బ్రేకులు వేసింది. అందుకే నేను పంట పండిస్తున్నా.. ట్రాక్టర్​ నడుపుతున్నా. కానీ ఇప్పుడు సీన్​ మార్చాల్సిన సమయం వచ్చేసింది. బిగ్​బాస్​ 2020తో త్వరలో మీ ముందుకు" అంటూ సల్మాన్​ వెల్లడించాడు.

2010 నుంచి సల్మాన్​ ఖాన్​ బిగ్​బాస్​ షోకు హోస్ట్​గా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబరులో ఈ ఏడాది సీజన్​ సెట్స్​ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.