బాలీవుడ్ నటుడు అర్భాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'పించ్'. సోషల్‌మీడియాలో తమపై వస్తోన్న ట్రోలింగ్స్, రూమర్ల గురించి సెలబ్రిటీలు సమాధానం చెప్పడమనేది ఈ షో సారాంశం. ఇటీవలే ప్రసారమైన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్నాడు. అతడిపై వస్తున్న కొన్ని రూమర్లతో పాటు ట్రోలింగ్స్‌పై స్పష్టత ఇచ్చాడు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌కు ఓ విచిత్ర ప్రశ్న ఎదురైంది.
"పిరికివాడా(సల్మాన్).. నువ్వు ఎక్కడ దాక్కున్నావు? నువ్వు దుబాయ్‌లో ఉన్నావని.. నీకు 17 ఏళ్ల కూతురు కూడా ఉందని ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. ఇంకా ఎన్నేళ్లు మమ్మల్ని వెధవల్ని చేస్తావు?" అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ షో ద్వారా సల్మాన్‌ఖాన్ స్వయంగా సమాధానమిచ్చాడు.
"కొంతమందికి ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయో? అందులో నిజం లేదు. వాళ్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ రూమర్లపై నా సమాధానం కావాలి అనుకుంటున్నారా? బ్రదర్, నాకు భార్య లేదు. నేను భారతీయుడిని.. నేను 9 ఏళ్ల వయసు నుంచి గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నా. ఆ రూమర్లకు నేను బాధ్యుడను కాను. నేను ఎక్కడ ఉంటున్నా అనేది దేశమంతా తెలుసు."
- సల్మాన్ ఖాన్, బాలీవుడ్ కథానాయకుడు
పించ్ సీజన్ 2 కార్యక్రమంలో సల్మాన్ ఖాత్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఆయుష్మాన్ ఖురానా, ఫరా ఖాన్, అనన్యా పాండే, కియారా అడ్వాణీ తదితరులు పాల్గొననున్నారు. వీరితో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా హాజరవుతారని వ్యాఖ్యాత అర్భాజ్ ఖాన్ షో ప్రారంభ ఎపిసోడ్ వెల్లడించాడు.
ఇదీ చూడండి.. ఆరోజు షూట్.. రాజ్ కుంద్రాను పట్టించింది!