ETV Bharat / sitara

బావమరిదితో కలిసి సల్మాన్ ఖాన్ మరోసారి - isabelli

అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్, తన బావమరిది ఆయుష్ శర్మతో కలిసి మరోసారి నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ పోలీస్, గ్యాంగ్​స్టర్ పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.

Salman Khan kickstarts shoot for Antim with Aayush Sharma
సల్మాన్​ ఖాన్ 'అంతిమ్' షూటింగ్ షురూ!
author img

By

Published : Dec 9, 2020, 5:54 PM IST

కండలవీరుడు సల్మాన్ ఖాన్​.. తన బావమరిది ఆయుష్ శర్మతో కలిసి మరోసారి నటిస్తున్నారు. మహేశ్​ మంజేకర్ దర్శకత్వం వహిస్తోన్న 'అంతిమ్' సినిమాలో సల్మాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే డిసెంబర్​ 6న షూటింగ్ కూడా ప్రారంభమైంది.

2018లో విడుదలైన 'లవ్​ యాత్రి' సినిమాలో వీరిద్దరూ ఇదివరకే కలిసి నటించారు. దీనికి అభిమానుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఈ నేపథ్యంలో హీరోగా ఆయుష్​కు మరిన్ని అవకాశాలు వచ్చేందుకు సల్మాన్​ తనతో మరో సినిమాలో నటిస్తున్నారు.

మహేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్​ సిక్కు పోలీసుగా, ఆయుష్ గ్యాంగ్​స్టర్​గా కనిపించనున్నారు. నవంబర్​ 16న 'అంతిమ్' మొదటి షెడ్యూల్​ షూటింగ్ పుణెలో జరిగింది. ఈ సందర్భంగా కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

సల్మాన్​ నటించబోయే 'కబీ ఈద్ కబీ దివాలీ'లోనూ ఆయష్​ నటించనున్నట్లు సమాచారం. 'క్వతా' సినిమాలోనూ కత్రినా చెల్లెలు ఇసాబెల్లాతో ఆయుష్ నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఆమిర్ తనయుడితో 'అర్జున్​ రెడ్డి' బ్యూటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.