ETV Bharat / sitara

చిరంజీవి సినిమాలో సల్మాన్​ఖాన్.. తమన్ క్లారిటీ - chiranjeevi movies

మెగాస్టార్ 'గాడ్​ఫాదర్'(chiranjeevi godfather cast) చిత్రంలో కండలవీరుడు సల్మాన్​(salman khan movies) నటిస్తున్నారు. ఈ విషయాన్ని తమన్ క్లారిటీ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేయనున్నారని తెలిపారు.

salman khan chiranjeevi
సల్మాన్​ఖాన్ చిరంజీవి
author img

By

Published : Nov 12, 2021, 5:39 PM IST

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi movies) కొత్త చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌(salman khan movies) నటించే అవకాశాలున్నాయంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. వీటిపై సంగీత దర్శకుడు తమన్‌(thaman songs) స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ కలిసి నటిస్తున్నారని వెల్లడించారు.

చిరంజీవి హీరోగా, దర్శకుడు మోహన్‌రాజా తీస్తున్న చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'(godfather movie). సూపర్‌హిట్‌ మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులోనే సల్మాన్‌ఖాన్‌ కనిపించనున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ హుషారైన గీతానికి డ్యాన్స్‌ చేయబోతున్నారని, ప్రముఖ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌తో(britney spears songs) ఈ పాట పాడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తమన్‌ తెలిపారు. ఆమెతో తెలుగు పాట పాడించాలా? ఇంగ్లిష్‌ సాంగ్‌ పాడించాలా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.

chiranjeevi godfather movie
చిరంజీవి గాడ్​ఫాదర్ మూవీ

ఈ చిత్రం పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన 'ఆచార్య'(acharya release date) వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహర్ రమేశ్‌ దర్శకత్వంలో చిరు ప్రకటించిన 'భోళా శంకర్‌' చిత్రం(bhola shankar chiranjeevi) గురువారం లాంఛనంగా మొదలైంది. వీటితోపాటు దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ)తో చిరు ఓ చిత్రం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.