ETV Bharat / sitara

భాయ్​ ప్రస్థానానికి 31 ఏళ్లు... ఫ్యాన్స్​కు గిఫ్ట్ - Salman Khan has completed 31 years in the film industry

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్..​ సినీరంగంలోకి అడుగుపెట్టి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన చిన్ననాటి ఫొటోను ట్విట్టర్​లో పంచుకుని ఆనందం వ్యక్తం చేశాడు.

హీరో సల్మాన్​ఖాన్
author img

By

Published : Aug 28, 2019, 7:51 PM IST

Updated : Sep 28, 2019, 3:48 PM IST

బాలీవుడ్​లో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు హీరో సల్మాన్​ ఖాన్​. సినీ రంగంలోకి అడుగుపెట్టి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్​ చేశాడు. ఈ ప్రయాణంలో తనను అభినందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు​.

"భారతీయ సినీ రంగానికి కృతజ్ఞతలు. ఈ 31 ఏళ్ల ప్రయాణంలో ప్రతి ఒక్కరూ నాకు అండగా నిలిచారు. ముఖ్యంగా ఇన్నేళ్ల పాటు ఆనందంగా సాగడానికి కారణం నా అభిమానులు, శ్రేయోభిలాషులే". -సల్మాన్​ ఖాన్​, హీరో

  • A bigg thank u to the Indian film industry n to every 1 who has been a part of this 31 year journey specially all my fans and well wishers who have made this amazing journey possible . . pic.twitter.com/w4XJ31FNT1

    — Salman Khan (@BeingSalmanKhan) August 27, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

సల్మాన్​ మెుదటి చిత్రం 'బీవీ హో తో హైసీ' అయినప్పటికీ.. అతడికి గుర్తింపు తెచ్చింది మాత్రం 1989లో వచ్చిన 'మైనే ప్యార్​ కియా'. ఈ సినిమాతోనే బాలీవుడ్​లో మంచి పేరు తెచ్చుకున్నాడు సల్మాన్​.

'హమ్​ ఆప్​కే హై కౌన్​..!(1994), 'కరణ్​ అర్జున్'​(1995), 'కామోషీ'(1996),'జుడ్వా'(1997), 'బీవీ నెం.1'(1999) చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు.

hero salman khan
హీరో సల్మాన్​ఖాన్

గత పదేళ్లలో 'దబాంగ్​'(2010), 'రెడీ'(2011), 'బాడీ గార్డ్'(2011)​, 'ఏక్ థా టైగర్'(2012)​, 'కిక్'(2014)​, 'సుల్తాన్'(2016)​, 'టైగర్​ జిందా హై'(2017) సినిమాలతో అభిమానులను అలరించాడీ స్టార్ హీరో​. ఇటీవలే విడుదలైన 'భారత్'​తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్​... 'దబాంగ్​ 3' చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు.

ఇది చదవండి: 'సల్మాన్​ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.