బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ఆదుకోవడంలో ముందుండే ఆయన మరోసారి పేదలకు అండగా నిలిచారు. మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో ఆకలితో అలమటిస్తున్న పేదల కోసం తన ఫాంహౌస్ నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో రేషన్ పంపారు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
- View this post on Instagram
@jacquelinef143 @vanturiulia @rahulnarainkanal @imkamaalkhan @niketan_m @waluschaa @abhiraj88
">
ఈ వీడియోలో సల్మాన్‌తోపాటు ఆయన స్నేహితులు నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రొమేనియా టీవీ వ్యాఖ్యాత లులియా వంతూర్, గాయకుడు కమల్ ఖాన్ తదితరులకు రేషన్ పంపిణీ చేయడానికి సాయం చేశారు. సంచుల్లో సరకులు నింపి, వాటిని వాహనాల్లో నింపారు. వీటిని సల్మాన్ ఫాంహౌస్‌కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో భాయ్‌పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనకి ఎవరూ సాటిరారని, నిజమైన హీరో అని మెచ్చుకున్నారు.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో, లాక్‌డౌన్ అమలు పరిచనప్పటి నుంచి పన్వెల్ ఫాంహౌస్‌లోనే ఉంటున్నారు సల్మాన్. ఆయన కుటుంబ సభ్యులు ముంబయిలోని ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇప్పటికే సల్మాన్ ఉపాధి లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సాయం చేశారు. 25 వేల మంది సినీ కార్మికులకు విడతల వారీగా బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకూ సాయం చేస్తానని మాటిచ్చారు. ఇటీవలే చిత్ర పరిశ్రమలోని దివ్యాంగులకు రూ.3000 చొప్పున అందించారు.