ETV Bharat / sitara

'రాధే' షూటింగ్​​లో పాల్గొన్న సల్మాన్​, దిశా పటానీ - రాధే షూటింగ్​లో సల్మాన్​, దిశా పటానీ

దాదాపు ఆరు నెలల తర్వాత చిత్రసీమలో షూటింగ్​లు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్​ ఇటీవలే తాను నటిస్తున్న 'రాధే' చిత్రీకరణలో పాల్గొన్నట్లు సోషల్​మీడియాలో వెల్లడించాడు. తాజాగా ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణలో హీరోయిన్​ దిశా పటానీ అడుగుపెట్టింది.

Salman Khan, Disha Patani back on Radhe set amidst new normal
'రాధే' షూటింగ్​​లో పాల్గొన్న సల్మాన్​, దిశా పటానీ
author img

By

Published : Oct 9, 2020, 8:35 PM IST

బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ఖాన్ నటిస్తున్న 'రాధే' సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్​లో పాల్గొన్నట్లు సోషల్​మీడియాలో సల్మాన్ ఓ పోస్ట్​ ద్వారా వెల్లడించాడు. లాక్​డౌన్​ తర్వాత కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ 'రాధే' షూటింగ్​ పునఃప్రారంభించినట్లు ఆ చిత్రనిర్మాణ సంస్థ సల్మాన్​ఖాన్​ ఫిల్మ్స్ తాజాగా​ ఓ మేకింగ్​ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణలో సల్మాన్​తో సహా దిశా పటానీ కూడా పాల్గొంది.

సెట్​లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ తగిన ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారని ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న జాకీ ష్రాఫ్​ వెల్లడించారు. ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. "గతంలో దాదాపు 200 మందితో కలిసి పనిచేసే వాళ్లకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా బాధలో ఉంది" అని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రాధే: యువర్ మోస్ట్​ వాంటెడ్​ భాయ్​' చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కావాల్సింది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.