ETV Bharat / sitara

Salman Khan: 'టైగర్​ 3' కోసం విదేశాలకు సల్మాన్​ - కత్రినాకైఫ్​ టైగర్​ 3

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​(Salman Khan), కత్రినాకైఫ్​(Katrina Kaif) జంటగా నటించనున్న కొత్త చిత్రం 'టైగర్​ 3'(Tiger 3). 'టైగర్​'(Tiger Movie Franchise) సిరీస్​లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమాలో గత రెండు చిత్రాలకు మించిన యాక్షన్​ను జోడించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని పోరాట సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్రబృందం త్వరలోనే విదేశాలకు వెళ్లనుంది.

Salman Khan & Katrina Kaif to Fly Abroad to Film 'Tiger 3'
Salman Khan: 'టైగర్​ 3' కోసం విదేశాలకు సల్మాన్​
author img

By

Published : Jul 13, 2021, 6:49 AM IST

'టైగర్​' చిత్రాల సిరీస్​లో(Tiger Movie Franchise) సల్మాన్​ఖాన్​(Salman Khan) నుంచి రాబోతున్న మరో చిత్రం 'టైగర్​ 3'(Tiger 3). ఈ చిత్రం కోసం భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. గత రెండు చిత్రాలను మించిన యాక్షన్​ హంగామా ఈ మూడో చిత్రంలో ఉండాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం విదేశాల్లో తెరకెక్కించనున్నారు. అందులో భాగంగానే ఆగస్టు రెండో వారంలో సల్మాన్​ఖాన్​తో పాటు ఇతర చిత్రబృందం యూరప్​కు బయలుదేరి వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఆస్ట్రియా, టర్కీ, రష్యా తదితర దేశాల్లో 50 రోజుల పాటు పోరాట ఘట్టాలను చిత్రీకరించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్న కత్రినా కైఫ్​(Katrina Kaif) సెప్టెంబరులో షూటింగ్​లో పాల్గొంటుందట. మనీష్​ శర్మ(Maneesh Sharma) దర్శకత్వంలో ఆదిత్య చోప్రా(Aditya Chopra) రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇదీ చూడండి.. బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్​పై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.