మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎడిటింగ్ జరపుకుంటున్న ఈ సినిమా నిడివి ఎక్కువ ఉందంట. ఎంత కత్తిరిస్తున్నా 3 గంటల 30 నిముషాలకు ఏ మాత్రం తగ్గట్లేదంట. ఈ విషయంపై దర్శకుడు సురేందర్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.
ఇందుకోసం స్వయంగా చిరంజీవే రంగంలోకి దిగాడంట. ఆయన ప్రస్తుతం సినిమాను పదే పదే వీక్షిస్తూ.. అనవసరమనుకున్న సీన్లను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడంట. ఏదేమైనా చివరగా.. రన్‌టైమ్‌ను 3 గంటల లోపే ఉండేలా నిర్దేశించుకున్నట్టు సమాచారం. ఇప్పుడీ పని పూర్తయితే గానీ, గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టడం కుదరదు. అక్టోబరు 2కు రెండు నెలలే ఉన్న నేపథ్యంలో అనుకున్న సమయానికి చిత్రం విడుదలవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
ఒకప్పుడు 3 గంటల నిడివి గల సినిమాలను ఆదరించారు. ప్రస్తుతం తక్కువ సమయంలోనే చిత్రాన్ని వీక్షించేందుకు సగటు ప్రేక్షకుడు ఇష్టపడుతున్నాడు. అయితే రంగస్థలం, అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలు కథ, కథనాలుతో 3 గంటల నిడివి ఉన్నా.. సినీ ప్రియులకు విసుగు తెప్పించలేదు. ఇదే ఫార్ములానూ సైరాలోనూ వాడనున్నట్టు సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది సమాచారం: సమంత ఫ్లయిట్ మిస్... లైఫ్ సూపర్ హిట్!