ETV Bharat / sitara

అలనాటి నటి బయోపిక్‌లో సాయిపల్లవి? - సాయిపల్లవి సౌందర్య

టాలీవుడ్​లో అలనాటి​ నటి సౌందర్య బయోపిక్​ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో ప్రధాన పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం.

Saipallavi
సాయిపల్లవి
author img

By

Published : Oct 12, 2020, 4:05 PM IST

చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసిన నటి సౌందర్య జీవితధారంగా టాలీవుడ్‌లో ఓ బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ దర్శకుడు ఈ బయోపిక్​ను తెరకెక్కించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఈ విషయంపై ఆయన ఇప్పటికే సౌందర్య కుటుంబ సభ్యులను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, ఈ బయోపిక్‌లో సౌందర్య పాత్రకు సాయిపల్లవి సరిగ్గా న్యాయం చేయగలరని భావించిన చిత్రబృందం ఇప్పటికే సదరు నటిని సంప్రదించినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సౌందర్య బయోపిక్‌ గురించి తమ అభిప్రాయాన్ని ట్విటర్‌ వేదికగా బయటపెట్టారు. 'సౌందర్య పాత్రకు కీర్తిసురేశ్‌ నప్పుతారు', 'సౌందర్య కథకు అనుష్క సెట్‌ అవుతారు' అని పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.

Soundarya
సౌందర్య

ఇదీ చూడండి 'నువ్వే కావాలి' కోసం నేను, రిచా అలా: తరుణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.