Sai pallavi news: ప్రముఖ నటి సాయిపల్లవి నగరంలోని శ్రీరాములు థియేటర్‌ను సందర్శించారు. తాను నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులు తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు బుర్ఖాలో వెళ్లారు. ఆమెతోపాటు చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఉన్నారు. సంబంధిత వీడియోను 'సాయిపల్లవి సర్‌ప్రైజ్ విజిట్' పేరిట చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే, కాసేపటికే ఆ వీడియోను తొలగించారు.
నాని కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. ఇందులో ఆయన శ్యామ్ సింగరాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. రోసీగా సాయి పల్లవి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి మరో కథానాయిక. మడోన్నా సెబాస్టియన్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రధారులు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఇవీ చదవండి: