సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరో కొత్త ప్రాజెక్టుతో రెడీ అవుతున్నాడు. సోమవారం లాంఛనంగా షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి 'ప్రతి రోజూ పండగే' అనే టైటిల్ పెట్టారు. రాశిఖన్నా హీరోయిన్గా మారుతీ దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకోనుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్‌నివ్వగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కథతో రూపొందించనున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందించనున్నారు. గతంలో 'సుప్రీం' సినిమాతో సూపర్ జోడీగా పేరుతెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా... మరోసారి కలిసి కనువిందు చేయనున్నారు.
