ఇటీవలే వచ్చిన 'సడక్ 2' ట్రైలర్ చెత్త రికార్డు నమోదు చేసింది. యూట్యూబ్‌లో ప్రపంచంలోనే అత్యధికులు డిస్‌లైక్స్ కొట్టిన మూడో వీడియోగా నిలిచింది. భారత్‌లో తొలిస్థానం సంపాదించింది.
సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మహేశ్ భట్ (దర్శకుడు), ఆలియా భట్(హీరోయిన్).. ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1991లో వచ్చిన 'సడక్'కు సీక్వెల్ ఈ సినిమా. ఇందులో సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. దొంగబాబాల నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. మహేశ్ భట్ దర్శకత్వం వహించగా, ముకేశ్ భట్ నిర్మించారు. త్వరలో ఓటీటీ వేదికగా చిత్రం విడుదల కానుంది. తండ్రి మహేశ్‌భట్ దర్శకత్వంలో ఆలియా నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు డిస్‌లైక్స్ కొట్టిన వీడియోలు
1.యూట్యూబ్ రివైండ్ 2018-18.2 మిలియన్లు
2. జస్టిన్ బీబర్ పాడిన 'బేబీ' గీతం- 11.6 మిలియన్లు
3. 'సడక్ 2' ట్రైలర్- 10.74 మిలియన్లు
4.బేబీ సార్క్ డ్యాన్స్-8.9 మిలియన్లు
5.జేక్ పాల్ నటించిన ఎవ్రీడే పాట-4.92 మిలియన్లు
6. కెన్ దిస్ వీడియో గెట్ వన్ మిలియన్ డిస్‌లైక్స్-4.89 మిలియన్లు
7.డెస్పాసిటీ- 4.66 మిలియన్లు
8.కాల్ ఆఫ్ డ్యూటీ: ఇన్ఫినైట్ వార్ఫేర్ రివీల్ ట్రైలర్-3.89 మిలియన్లు