ముద్దుగుమ్మలు తాప్సీ, భూమి ఫెడ్నేకర్.. 60 ఏళ్ల మహిళా షూటర్స్ పాత్రల్లో నటిస్తున్న సినిమా 'సాంద్ కీ ఆంఖ్'. ఉత్తర్ప్రదేశ్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. సంబంధిత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు హీరోయిన్లు.
అత్యంత వృద్ధ మహిళా షూటర్లు చంద్రూ తోమర్, ప్రకాశీ తోమర్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాశ్ జా, వినీత్ కుమార్ నటిస్తున్నారు. తుషార్ హిరానందానీ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">