'సాహో' ఫేమ్ సుజిత్.. తాను తెరకెక్కించబోయే కొత్త సినిమా కోసం జీ స్టూడియోస్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. భావోద్వేగంతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందబోతుంది.
సుజిత్.. తొలి సినిమా 'రన్ రాజా రన్' సినిమాను రూపొందించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత రెండో సినిమాగా 'సాహో'ను పాన్ ఇండియా చిత్రంగా ప్రభాస్‌తో తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాగా, ఇప్పడు తీయబోయే కొత్త సినిమా మూడోది అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: సాహోలో ఒక్క ఛేజ్ సీన్ కోసం 90 కోట్లు..!