ETV Bharat / sitara

చరణ్​ సరసన రష్మిక నటించనుందా? - చరణ్ సరసన రష్మిక

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్​ సరసన రష్మిక నటించనుందట.

rashmika
రామ్​ చరణ్​ సరసన రష్కిక నటించనుందా?
author img

By

Published : Dec 4, 2020, 10:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. చిరు సరసన కాజల్ నటించనుంది. ఇందులో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతడి పాత్ర సినిమాకు హైలట్​గా నిలవబోతుందట. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్ సరసన రష్మిక కనిపించనుందట. ఇప్పటికే ఈ విషయమై చిత్రబృందం ఆమెతో చర్చలు కూడా జరిపిందని తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రారంభమైన 'ఆచార్య' షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సెట్లో చరణ్ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:బాలీవుడ్ వారసులు వచ్చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.