రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'(రౌద్రం రణం రుధిరం). ఇందులో ఆలియా భట్.. చరణ్ సరసన నటిస్తోంది. సినిమా ఇప్పటికే డెభ్బై అయిదు శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. తిరిగి షూటింగ్‌ను మేనెల్లో ప్రారంభించనున్నామని చిత్రబృందం తెలిపింది. చెర్రీ, ఆలియాల మీద పాటతో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారట.
సినిమాకు సంబంధించి ఈమధ్యనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో 'భీం ఫర్ రామరాజు' వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖని, హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్‌లాంటి నటీనటులు ఇందులో నటిస్తున్నారు. 400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">