RRR movie promotions: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ హిందీ కమెడియన్ భువన్ బామ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఫన్ ఫుల్ ఎపిసోడ్‌గా రూపుదిద్దుకున్న ఈ వీడియోను తాజాగా చిత్రబృందం షేర్ చేసింది. కాగా, ఈ ఇంటర్వ్యూలో భువన్.. తారక్, చరణ్ సినిమాలపై సెటైర్లు వేశారు. దానికి మన స్టార్స్ ఇద్దరూ నవ్వులు పూయించారు. పరాజయం పొందిన సినిమాలపై యాంకర్ ఫన్నీ కామెంట్స్ చేస్తే ఎవరైనా వెంటనే ఆగ్రహానికి గురవుతారు. కానీ మన స్టార్స్ మాత్రం నవ్వులు పూయిస్తూ.. సరదాగా సమాధానాలు చెప్పడం వల్ల నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం..
భువన్ బామ్: మీకు గుర్రాలంటే ఇష్టమని విన్నాను. నిజమేనా?
చరణ్: అవును
భువన్ బామ్: భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మీరే రారాజు. భారీ పారితోషికం ఇస్తామని కాకుండా ఇంకా ఎలాంటి విషయాలు చెప్పి ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం వీరిద్దర్ని ఒప్పించారు?
రాజమౌళి: (నవ్వులు). ఈ సినిమా చేస్తే మీరు గ్లోబల్ స్టార్స్ అవుతారని చెప్పా. పారితోషికంగా వంద కోట్లు ఇవ్వలేదు కానీ.. (మధ్యలో తారక్ అందుకుని ఫిగర్ చెప్పొద్దు అనడంతో అందరూ నవ్వులు పూయించారు)
భువన్ బామ్: ఎంతోమంది నటీనటులు రాజమౌళితో కలిసి పనిచేయాలనుకుంటారు. మరి, మీకు ఎవరితో వర్క్ చేయాలని ఉంది?
తారక్: ఆయన దర్శకుడు మాత్రమే కాదు అద్భుతమైన నటుడు కూడా.
రాజమౌళి: ఎవరైతే నన్ను వంద కోట్ల పారితోషికం అడగకుండా ఉంటారో వాళ్లందరితో తప్పకుండా వర్క్ చేస్తా. (నవ్వులు)
భువన్ బామ్: తారక్.. మీరు ఎవరితో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు?
తారక్: కొంతమంది స్టార్స్‌తో కలిసి పని చేయాలని ఉంది. అదే మాదిరిగా చెప్పాలంటే భువన్ బామ్‌తో కూడా. (నవ్వులు)
భువన్ బామ్: గత కొన్నిరోజులుగా నేను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఇంటర్వ్యూలన్నీ ఫాలో అవుతున్నా. వాటిల్లో ఒకచోట మీరు రాజమౌళి సర్‌కి కితకితలు పెట్టారు. చరణ్ మిమ్మల్ని గిల్లుతున్నారు.. మీ మధ్య ఇంత ఫ్రెండ్‌షిప్ ఎలా వచ్చింది?
తారక్: దాని గురించి వదిలేయ్ కానీ.. జానీ సిన్స్‌ని ఇంటర్వ్యూ చేశావు కదా ఎలా అనిపించింది?
భువన్ బామ్: అప్‌టుడేట్‌గా ఉండే మనుషులంటే నాకెంతో ఇష్టం. ఆ ఇంటర్వ్యూ బాగా అనిపించింది.
భువన్ బామ్: మీ మధ్య ఈ స్నేహం కేవలం సెట్స్‌లోనే ఉంటుందా? బయట కూడా మీరు ఇలాగే ఉంటారా?
తారక్: మేము ఎంతోకాలం నుంచి స్నేహితులం. మా మధ్య ఉన్న స్నేహాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్’ ద్వారా రాజమౌళి ప్రేక్షకులకు చూపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భువన్ బామ్: రాజమౌళి పని రాక్షసుడు అంటూ మీరు చాలా సార్లు చెప్పారు. ఎందుకు?
తారక్: ప్రతీది పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. ఏదైనా తను అనుకున్నట్టు పర్‌ఫెక్ట్‌గా రాకపోతే ఊరుకోడు. ఆయన నుంచి పర్‌ఫెక్షన్‌ని దూరం చేయడానికి ఎలాంటి మెడిసన్ లేదు.
భువన్ బామ్: రాజమౌళి సర్.. ఈ ఆరోపణలకు మీ సమాధానం ఏంటి?
రాజమౌళి: తెలుగులో ఒక సామెత ఉంటుంది. పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకం మొత్తం పచ్చగానే కనిపిస్తుందని. అదే విధంగా, తారక్ కూడా ఒక రాక్షసుడే. అందుకే అతడి కంటికి నేనూ రాక్షసుడిగానే కనిపిస్తున్నా.
భువన్ బామ్: ‘శక్తి’లో మీరు చెప్పే డైలాగ్‌లంటే నాకెంతో ఇష్టం?
తారక్: శక్తి.. శక్తియేనా. ఆ సినిమా ఒక్కటే నీకు గుర్తుందా? నేను నటించిన వేరే సినిమాలు ఏమీ గుర్తులేవా? లేదా ఆ సినిమా ఒక్కటే నువ్వు చూశావా? అని ప్రశ్నిస్తూ.. ఆ సినిమా గురించి మర్చిపో అంటూ నవ్వులు పూయించారు.
భువన్ బామ్: ఎవరితో మీరు వర్క్ చేయాలని అనుకుంటున్నారు?
చరణ్: ఒక నటుడిగా నన్ను ఛాలెంజ్ చేసే, నాలో ప్రతిక్షణం ఉత్సుకత రేకెత్తించే ఏ అగ్ర దర్శకుడితోనైనా వర్క్ చేయాలని ఉంది.
రాజమౌళి: ఇప్పుడైనా మీ ఇద్దరూ నన్ను ప్రమోట్ చేయవచ్చు కదా. రాజమౌళి లాంటి మంచి దర్శకులతో వర్క్ చేయాలని ఉంది అనొచ్చుగా ..!
భువన్ బామ్: చరణ్ సర్ మీరు ‘జంజీర్’ చేశారు కదా?
తారక్: నవ్వులు
చరణ్: అతను ఇందాక నువ్వు నటించిన సినిమా గురించి అడిగినప్పుడు నేను నవ్వలేదు.
తారక్: నన్ను ‘శక్తి’ గురించి అడిగినప్పుడు నేను నిన్ను చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అతడు ప్రశ్న అడిగిన విధానానికి నవ్వు వచ్చింది.
భువన్ బామ్: ‘జంజీర్’తో రామ్‌చరణ్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను థియేటర్‌కు వెళ్లాను. నాకు తెలిసినంత వరకూ నేను అంత ప్రశాంతంగా సినిమా ఎప్పుడూ చూడలేదు.
చరణ్: ఎందుకు మీరు రీక్లైనరీ సీట్లు బుక్ చేసుకుని సినిమా చూశారా?
భువన్ బామ్: లేదు సర్.. హాల్ అంతా ఖాళీగానే ఉంది.
భువన్ బామ్: రాజమౌళి సినిమాలో ఓ రోల్ చేయాలంటే ఒక నటుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?
తారక్: విజన్, నిజాయతీ, యాక్టింగ్
రాజమౌళి: గుర్రపుస్వారీ, జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్, నటన, ఐదారు సంవత్సరాలపాటు డేట్స్..
భువన్ బామ్: ‘ఆర్‌ఆర్‌ఆర్’ త్వరలో రానుంది. ఆ సినిమా గురించి మీ అభిప్రాయం?
తారక్: రాజమౌళి విజన్‌ని మేము నమ్మాం. ఈసినిమాలో భాగమయ్యాం.
చరణ్: మూడేళ్ల ప్రయాణం. ఈప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాం. ఇదొక డ్రీమ్ ప్రాజెక్ట్.
భువన్ బామ్: మీ దృష్టిలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంటే ఏమిటి?
రాజమౌళి: ఇది నాకొక బిగ్ ఛాలెంజ్. రెండు గొప్ప పాత్రలను ఒక తాటిపైకి తీసుకురావడం ఒక ఛాలెంజ్‌గా అనిపించింది.
భువన్ బామ్: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా?
చరణ్: వృత్తిపరమైన విషయాలకు సంబంధించి మన నాన్న ఇప్పటివరకూ ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. . ‘జంజీర్’ పరాజయమైనప్పుడు కూడా ఆయన నాతో ఎప్పుడూ వర్క్ గురించి మాట్లాడలేదు. ఫోన్ చేసిన ప్రతిసారీ టైమ్‌కి నిద్రపోతున్నావా? ఉదయాన్నే ఏడింటికల్లా సెట్‌కి వెళుతున్నావా? అనే అడుగుతారు. దానిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే వారసత్వం అంటే క్రమశిక్షణ.
ఇదీ చూడండి: Archana Singh Rajput: అసోం బ్యూటీ అదిరే అందాలు..