ETV Bharat / sitara

'ఆయనే 'ఆర్​ఆర్​ఆర్' చిత్రానికి వెన్నెముక' - ఆర్​ఆర్​ఆర్ లేటెస్ట్ న్యూస్

RRR Press Meet : 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్పెషల్‌ చిట్‌చాట్‌ శుక్రవారం బెంగళూరులో నిర్వహించారు. తారక్‌ వరుస పంచులు.. టీమ్‌ నవ్వులు, రాజమౌళి ఆసక్తికర సమాధానాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఆర్ఆర్ఆర్ చిట్​చాట్ విశేషాలు వారి మాటల్లోనే..

RRR
ఆర్​ఆర్​ఆర్ చిట్‌చాట్‌
author img

By

Published : Dec 10, 2021, 8:54 PM IST

RRR Press Meet Bangalore: 'బాహుబలి' విడుదలైన సమయంలో కన్నడలో ఆ చిత్రాన్ని విడుదల చేయనందుకు తనని కొంతమంది విమర్శించారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. శుక్రవారం ఆయన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌తో బెంగళూరులో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. రామ్‌చరణ్‌, తారక్‌, అలియాభట్‌తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య సైతం ఈ సమావేశంలో పాల్గొని విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ విశేషాలు మీకోసం..

కన్నడలో మీరే డబ్బింగ్‌ చెప్పుకున్నారు కదా? భాషాపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?

తారక్‌: మా అమ్మ కర్ణాటకకు చెందిన వారే. ఈ సినిమా డబ్బింగ్‌ సమయంలో 'జాగ్రత్తగా మాట్లాడు' అని అమ్మ ఒక్కటే చెప్పారు. ప్రముఖ కన్నడ రచయిత వరదరాజు మాకు భాషాపరంగా ఎంతో శిక్షణ ఇచ్చారు. దానివల్ల డబ్బింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు.

మీ మిత్రుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం గురించి ఏమైనా మాట్లాడగలరా?

తారక్‌: పునీత్‌ చనిపోవడం నన్ను ఎంతో కలచివేసింది. (అంటూ తారక్‌ భావోద్వేగానికి గురయ్యారు)

మీ విజయ రహస్యం ఏమిటి?

రాజమౌళి: నేనెప్పుడూ సక్సెస్‌ సాధించానని భావించను. ప్రతి సినిమానీ నా మొదటి ప్రాజెక్ట్‌లానే అనుకుంటాను. నేను ఏదైతే కథ అనుకుంటానో దానికి సరిపడా నటీనటులను ఎంచుకోవడమే నా బలం అని భావిస్తుంటాను. ఈ సినిమా విషయానికొస్తే కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల కోసం సరైన నటులను ఎంచుకోవటం చాలా ముఖ్యం. తారక్‌, చరణ్‌ల రూపంలో నాకు మంచి నటులు దొరికారు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' రియల్‌ కథా? లేదా ఫిక్షనా?

రాజమౌళి: అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లలో ఉన్న ఎనలేని స్ఫూర్తిని ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఒక్క సీన్‌కీ హిస్టరీతో సంబంధం ఉండదు. అంతా ఫిక్షనల్‌ మాత్రమే. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంతో వాళ్లిద్దరూ పోరాటం చేశారు. ఆ ధైర్యాన్నే మేము 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో చూపించాం.

రాజమౌళి చిత్రంలో నటించడం ఎలా ఉంది?

అలియా భట్‌: ఆయన సినిమాలో నటించడం వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సినిమాపై ఆయనకి ఎంతో విజ్ఞానం ఉంది. బ్రేక్‌ సమయంలోనూ ఆయన నాకు ఎన్నో కథలు చెప్పేవారు.

సినిమాలో తారక్‌-పులి ఫైట్‌ ఉంది కదా. దాన్ని చూస్తుంటే లాజిక్‌గా అనిపిస్తోందా?

చరణ్‌: లాజిక్‌ పూర్తైనప్పుడే డ్రామా ప్రారంభమవుతుంది అని నేను భావిస్తుంటాను. రాజమౌళి గురించి నాకు బాగా తెలుసు. ఆయన ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి ఆయన తెరకెక్కించిన సినిమాలు చూసేటప్పుడు నేను లాజిక్ గురించి ఆలోచించను.

RRR Chit Chat
ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌

'ఆర్‌ఆర్‌ఆర్‌'ను కన్నడలో డబ్బింగ్‌ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

రాజమౌళి: టబాహుబలిటని కేవలం తెలుగు, తమిళంలోనే చిత్రీకరించాను. హిందీ, మలయాళంలో డబ్‌ చేశాను. ఆ సినిమా ట్రైలర్‌ విడుదలైన సమయంలో కన్నడలో 'బాహుబలి' డబ్‌ చేయలేదని చాలామంది నన్ను తిట్టారు. సోషల్‌మీడియాలో నెగెటివ్‌ కామెంట్లు పెట్టారు. 'అన్ని భాషలకు ప్రాముఖ్యత ఇచ్చారు. కన్నడ వాళ్లని చులకనగా చూస్తున్నారా?' అని అన్నారు. కానీ, ఆ సమయంలో కన్నడలో ఉన్న రూల్స్‌ ప్రకారమే మేము 'బాహుబలి'ని డబ్‌ చేయలేకపోయాం. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌'ని కన్నడలో డబ్‌ చేసిన సమయంలో భాష పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.

కన్నడ హీరోలతో మీరు సినిమా ఎప్పుడు చేస్తారు?

రాజమౌళి: అది నేను ఇప్పుడు చెప్పను. ఎందుకంటే.. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెబితే అందరూ దాని గురించే మాట్లాడతారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' పక్కకు వెళ్లిపోతుంది. కాబట్టి, 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలయ్యాక తప్పకుండా ఓసారి అందరితో చిట్‌చాట్‌ నిర్వహిస్తాను. అప్పుడు చెబుతాను.

ఎన్టీఆర్‌.. మీకన్నా చరణ్‌ చిన్నవాడు కదా. సినిమాలో ఆయన్ని అన్న అని పిలవడం ఎలా ఉంది?

తారక్‌: చరణ్‌ని అన్నయ్య అని పిలవడం నాకు బాగుంది. మా ఇద్దరి మధ్య కేవలం ఒక ఏడాది మాత్రమే గ్యాప్‌ (నవ్వులు)

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందా?

దానయ్య: తప్పకుండా సినిమా కలెక్షన్స్‌పై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. సినిమా టికెట్ ధరల విషయంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఎక్కువ షోలు ప్రదర్శించే విధంగా మాట్లాడుతున్నాం.

షూటింగ్‌ సమయంలో రాజమౌళి చెప్పినట్లు ఏదైనా సీన్‌ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?

తారక్‌: సెట్‌లో ఆయన కూల్‌గా ఉండడు. మమ్మల్ని ఫుల్‌ టార్చర్‌ చేశాడు (నవ్వులు). (మధ్యలో అలియా మైక్‌ తీసుకుని నాకు మాత్రం సరదాగా సాగింది) అని చెప్పడంతో.. ఆమెకు షూటింగ్‌ సరదాగా ఉండి ఉండొచ్చు కానీ నేను, చరణ్‌ టార్చర్‌ చూశాం.

RRR
ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలో ఎన్టీఆర్

చరణ్‌: కొవిడ్‌ నిబంధనలు, కొన్ని లొకేషన్స్‌లో నిబంధనలు ఉన్న కారణంగా రాజమౌళి మమ్మల్ని యూరప్‌ తీసుకువెళ్లారు. ఉక్రెయిన్‌లో 12 రోజులు ఉన్నాం. అందులో 10 రోజులు.. రోజూ సుమారు 7 గంటలపాటు రిహార్సల్స్‌ మాత్రమే చేశాం. మా ప్రాక్టీస్‌లు ఆయనకు నచ్చడంతో 11వ రోజు షూట్‌ ప్రారంభించాడు. కేవలం రిహార్సల్స్‌ కోసమే వేరే దేశానికి తీసుకెళ్లిన దర్శకుడు ఈయనే అయ్యుంటాడు.

తారక్‌: సాధారణంగా కూడా రాజమౌళి ఇలానే ఉంటారు. ఆయనకు ఏదైనా కావాలంటే అది పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకూ ఇలాగే చేస్తారు. కావాలంటే రమా గారిని అడగండి. (నవ్వులు)

రాజమౌళి: నేను ఎప్పుడైనా మీపై అరిచానా?

చరణ్‌: లేదు

రాజమౌళి: నేను ఎప్పుడైనా నా చిరాకుని మీ పై చూపించానా?

తారక్‌: ఎస్‌ (నవ్వులు)

రాజమౌళి: ఎప్పుడు?

తారక్‌: ఎప్పుడూ.. ప్రతిసారీ మీరు మరో టేక్‌ అంటుంటారు. కాబట్టి మీరు ఫ్రస్టేటెడ్‌ డైరెక్టర్‌

చరణ్‌: ఆయన కోపం, చిరాకుని పైకి చూపించరు ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటారు. (మధ్యలో తారక్‌ అందుకుని సరదాగా నో అనడంతో అందరూ నవ్వులు పూయించారు)

రాజమౌళి: నాటు నాటు సాంగ్‌కి వచ్చిన సక్సెస్‌ చూసి మీరు ఆనందిస్తున్నారా?

తారక్‌, చరణ్‌: ఎస్.. (మధ్యలో రాజమౌళి అందుకొని అలాంటప్పుడు మీరు నాపై ఫిర్యాదు చేయకూడదు)

తారక్‌: ఆమె అడిగిందని చెప్పాను సర్‌. కంప్లెయింట్‌ చేయడం లేదు (నవ్వులు)

ఈ సినిమాకి వెన్నెముక మీ ఫాదర్‌ విజయేంద్రప్రసాద్‌ రాసిన కథేనా?

రాజమౌళి: నా మునుపటి చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకి సైతం మా నాన్న విజయేంద్రప్రసాద్‌ కథ రాశారు. ఆయనే ఈ చిత్రానికి వెన్నెముక. ఈ సినిమా కథ విషయంలో నాన్నని బాగా టార్చర్‌ చేశాను. నేను ఏవిధంగా టార్చర్‌ చేశాననేది చరణ్‌-తారక్‌ని కాదు మా నాన్నని అడగండి.

మీ సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల్లో ఎంతో ప్రభావం చూపిస్తాయి. అజయ్‌ దేవ్‌గణ్‌ పాత్ర ఎలా ఉంటుంది?

రాజమౌళి: అజయ్‌ దేవ్‌గణ్‌ పాత్ర ఎంతో కీలకమైనది. ఆయన పాత్ర ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపేలా ఉంటుంది. ఈ సినిమా ఆయన నుంచే ప్రారంభమవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ''పుష్ప'లో ఆ మూడు సీన్లు చూసి సుకుమార్​-బన్నీకి దణ్ణం పెట్టేశా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.