'ఆర్ఆర్ఆర్' నుంచి ఇటీవల విడుదల చేసిన ఆలియా భట్ ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో ఈమె నటించిన సీత పాత్ర గురించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఆలియా పాత్రకు మరిన్ని సీన్లు!
గత డిసెంబరులోనే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన షెడ్యూల్లో ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్‌పై సన్నివేశాల్ని పూర్తి చేశారు. అయితే కథ అవసరం దృష్ట్యా వారి పాత్రల్ని పూర్తిస్థాయిలో పొడిగించారని, అందుకే ఆలియా మళ్లీ షూటింగ్‌కు హాజరు కానుందని సమాచారం.
ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.400 కోట్లతో నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: