కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన చిత్రం 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకుడు. 2018లో వచ్చిన ఈ చిత్రం అన్నిచోట్ల భారీ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో రెండో భాగం 'కేజీఎఫ్ 2'పై అన్ని పరిశ్రమల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వితీయ భాగాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మైసూర్లో చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని జరిగే చివరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది.
"రెండో భాగంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి. మాఫియా ప్రపంచాన్ని భారీ స్థాయిలో చూపించబోతున్నాం"
- ప్రశాంత్ నీల్, దర్శకుడు
ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సంజయ్‌దత్ నటిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. రవి బస్రూర్ సంగీతమందించాడు. కేఆర్జీ స్టూడియోస్ నిర్మిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: చిన్నారుల ఆవేదన విని సూర్య కన్నీళ్లు