సాగరిక ఘోష్ రచించిన "ఇందిరా: ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్" పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. సంబంధించిన హక్కులను కొనుగోలు చేసింది విద్యాబాలన్. ఇటీవలే 'మిషన్ మంగళ్' వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిందీ హీరోయిన్.
"వెబ్ సిరీస్లో నేను తొలిసారిగా నటిస్తున్నా. ప్రస్తుతం ఈ కథ పరిశీలన దశలోనే ఉంది. చాలా పనితో పాటూ ఎక్కువ సమయం అవసరం. అయితే వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాటానికి ప్రయత్నిస్తాం". -విద్యాబాలన్, హీరోయిన్
ఈ వెబ్ సిరీస్కు రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలో పూర్తి సమాచారం వెల్లడించనున్నారు.
ఇదీ సంగతి: 'మాట ఇవ్వకుండా సినిమా చేయాలనిపిస్తోంది'