ETV Bharat / sitara

రైతులకు మద్దతుగా రిహాన్న ట్వీట్.. మండిపడ్డ కంగన - రిహాన్న ట్వీట్​పై మండిపడ్డ కంగనా రనౌత్

ప్రముఖ పాప్ సింగర్ రిహాన్న రైతులకు మద్దతుగా చేసిన ట్వీట్​పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడింది. వారు రైతులు కాదు ఉగ్రవాదులంటూ ఘాటు రిప్లై ఇచ్చింది.

Rihanna supports India's farmers protest
రైతులకు మద్దతుగా రిహాన్న ట్వీట్.. మండిపడ్డ కంగన
author img

By

Published : Feb 3, 2021, 9:29 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ ధర్నాలు, ర్యాలీలతో దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీలకు పలువురు మద్దతు తెలుపుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ప్రముఖ పాప్ సింగర్ రిహాన్న రైతుల గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

దిల్లీలో రైతుల పోరాటం గురించి తెలుపుతూ ఓ న్యూస్ ఆర్టికల్​ను ట్విట్టర్​లో షేర్ చేసిన రిహాన్న 'ఈ అంశంపై మనం ఎందుకు మాట్లాడకూడదు?' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై ఘాటుగా స్పందించింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. వారు రైతులు కాదు ఉగ్రవాదులంటూ మండిపడింది.

  • No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA...
    Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a

    — Kangana Ranaut (@KanganaTeam) February 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దీని గురించి ఎవరూ మాట్లాడరు. ఎందుకంటే వారు రైతులు కాదు ఉగ్రవాదులు. భారత్​ను విభజించాలని చూస్తున్నారు. అప్పుడు చైనా ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని యూఏఎస్​లోలాగా ఇక్కడా తన కాలనీలను ఏర్పాటు చేసుకుంటుంది. మీలాగా మేము మా దేశాన్ని అమ్ముకోం."

-కంగనా రనౌత్, బాలీవుడ్ నటి

అయితే మరో బాలీవుడ్ నటి రిచా చద్దా, స్వర భాస్కర్.. రిహాన్నాకు మద్దతుగా నిలిచారు. ఆమె ట్వీట్​ను స్వాగతించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.