ETV Bharat / sitara

'రియా పరారైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవం' - rhea chakraborty lawyer satish maneshinde

నటి రియా చక్రవర్తి కుటుంబం కనిపించట్లేదని వస్తోన్న వార్తలపై స్పందించారు ఆమె తరఫు న్యాయవాది సతీశ్​ మాన్​షిండే. పోలీసులకు రియా అందుబాటులోనే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో రియా సహా మరో ఆరుగురిపై కేసు పెట్టారు సుశాంత్​ తండ్రి కేకే సింగ్​.

Rhea Chakraborty not absconding, says her lawyer
'రియా చక్రవర్తి పరారైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవం'
author img

By

Published : Aug 3, 2020, 8:27 PM IST

Updated : Aug 3, 2020, 9:55 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా.. ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు ఆమె తరఫు న్యాయవాది సతీశ్​ మాన్​షిండే. గత మూడు రోజులుగా రియా, తన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

"రియా చక్రవర్తి కనిపించట్లేదని బిహార్​ పోలీసుల వాదించడం సరైనది కాదు. ఆమె ముంబయి పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరై వారికి సహకరిస్తోంది. ఈరోజు వరకు బిహార్​ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు, సమన్లు కానీ రియాకు రాలేదు. ప్రస్తుతం వారి అధికార పరిధిలో దర్యాప్తు చేయడానికి వీలులేదు.కేసు విచారణను పాట్నా నుంచి ముంబయికి తరలించాలని ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్​ వేసింది" అని సతీశ్​ తెలిపారు.

రియా తన కుటుంబంతో కలిసి రాత్రికి రాత్రే ఇంటిని వదిలి పరారైనట్లు పలు వార్తలు వచ్చాయి. సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యకు కారకులుగా పేర్కొంటూ.. రియా సహా మరో ఆరుగురిపై పాట్నాలో కేసు నమోదు చేశారు సుశాంత్​ తండ్రి కేకే సింగ్​. అనంతరం ఆమె కనపించకపోవడం చర్చనీయాంశమైంది. అయితే తనకు దేవుడు, న్యాయవ్యవస్థపై నమ్మకముందని సోషల్​ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేసింది రియా.

కేసును పాట్నా నుంచి ముంబయికి ట్రాన్స్​ఫర్​ చేయాలని ఇప్పటికే సుప్రీంలో పిటిషన్​ వేసింది రియా చక్రవర్తి. అయితే పాట్నాలోనే కేసు కొనసాగాలని కౌంటర్​ పిటిషన్​ వేశారు కేకే సింగ్​ తరఫు న్యాయవాది వికాశ్​ సింగ్​. ఇది ఆగస్టు 5న అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు రానుంది.

జూన్​ 14న ముంబయి బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకున్నాడు హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​​​. శవపరీక్ష అనంతరం నటుడిది ఆత్మహత్యగా వైద్యులు ధ్రువీకరించారు.

Last Updated : Aug 3, 2020, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.