ETV Bharat / sitara

సుశాంత్​ కేసుపై ఫిట్​నెస్​ ట్రైనర్​ షాకింగ్​ వ్యాఖ్యలు

సుశాంత్ సింగ్​​ కేసుకు సంబంధించి అతని ఫిట్​నెస్​ ట్రైనర్​ షామి అహ్మద్​ ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. సుశాంత్​ ఏ వైద్యుడిని సంప్రదించి ఉండకపోవచ్చని.. రియానే అతనికి సైకోట్రోపిక్​ మెడిసిన్​ ఇచ్చిందని పేర్కొన్నాడు.

Shocking revelation: 'Rhea administered psychotropic drugs to Sushant'
సుశాంత్​ కేసుపై ఫిట్​నెట్​ ట్రైనర్​ షాకింగ్​ వార్తలు
author img

By

Published : Aug 1, 2020, 9:24 AM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, సుశాంత్​ ఫిట్​నెస్​ ట్రైనర్​ షామి అహ్మద్​ షాకింగ్​ వార్తలు వెలుగులోకి తీసుకొచ్చాడు. రియా చక్రవర్తితో రాజ్​పుత్​ ప్రేమలో పడినప్పటి నుంచి పరిస్థితులు భిన్నంగా మారిపోయాయని అన్నాడు.

తన సమస్యపై సుశాంత్ వైద్యులను సంప్రదించి ఉండకపోవచ్చని.. రియానే సుశాంత్​కు ఈ మందులు ఇచ్చిందని పేర్కొన్నాడు.

"వైద్యులు ఏ మందులు ఇస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇటువంటి ప్రిస్క్రిప్షన్​ ఇచ్చే ముందు సుశాంత్​తో కౌన్సిలింగ్​ సెషన్​ నిర్వహించాలి. నాకు తెలిసి అలాంటివేవీ జరగలేదు. ఒక వేళ ఆ డాక్టర్​కు కూడా ఈ కౌన్సిలింగ్​ గురించి తెలియకపోతే.. సుశాంత్​ మానసిక ఒత్తిడికి కారణం ఏంటని తెలుసుకోకుండా మందులు ఎలా సూచిస్తారు" అని సుశాంత్​ ఫిట్​నెస్​ ట్రైనర్​ ప్రశ్నించాడు.

మరోవైపు సుశాంత్​ శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడని.. అటువంటప్పుడు ఎలాంటి మందులు అవసరం లేదని తెలిపాడు.

మెంటల్​ హెల్త్​కేర్​ యాక్ట్​ 2017 ప్రకారం.. బాధితుడి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరూ మందులు సూచించకూడదు. కానీ, సుశాంత్​ను రియా సైకోట్రోపిక్​ మెడిసిన్​ తీసుకోమని బలవంతం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.