ETV Bharat / sitara

కరోనా వల్ల రణ్​బీర్​-ఆలియా పెళ్లి ప్లాన్ మారింది! - రణ్​బీర్​ కపూర్​

కరోనా వల్ల ఆలియా-రణ్​బీర్ పెళ్లి ప్రణాళిక మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాస్త.. ముంబయిలో జరగనుందని టాక్. త్వరలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశముంది.

Reports of Ranbir Kapoor-Alia Bhatt's December wedding float again amidst coronavirus lockdown
కరోనా వల్ల రణ్​బీర్​-ఆలియా పెళ్లి ప్లాన్ మారింది!
author img

By

Published : Apr 3, 2020, 3:36 PM IST

కరోనా కారణంగా దేశంలో ప్రస్తుతం లాక్​డౌన్​ అమల్లో ఉంది. ఈ పరిస్థితుల వల్ల బాలీవుడ్​ జోడీ​ రణ్​బీర్​కపూర్​-ఆలియా భట్​ల పెళ్లి ప్రణాళిక మారిందని సమాచారం. డెస్టినేషన్​ వెడ్డింగ్ కాస్త ముంబయిలో బ్యాండ్​ బజా బరాత్ మధ్య జరగనుంది. ఈ విషయాన్ని వారి కుటుంబాలకు సన్నిహితుడైన ఓ వ్యక్తి చెప్పాడు.

రణ్​బీర్-ఆలియా ఈ ఏడాది డిసెంబర్​లో పెళ్లి చేసుకోనున్నారు. ఆ నెల​ 21న వివాహ వేడుకలు ప్రారంభమై, నాలుగు రోజులపాటు జరగనున్నాయట. వీటి గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

'బ్రహ్మాస్త్ర'లో తొలిసారి

రణ్​బీర్​-ఆలియా తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రావాలి. కానీ అదే నెలలో వీరి పెళ్లి ఉండటం వల్ల విడుదల తేదీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'కరోనాను తరిమికొట్టేందుకు సూపర్​హీరో అవుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.