Pawan kalyan Republic Movie: ప్రజాస్వామ్యదేశంలో నిజాయితీగా పనిచేసే అభిరామ్ అనే ఓ ఐఏఎస్ అధికారి కథతో ప్రముఖ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం 'రిపబ్లిక్'. సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలోనూ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగాన్ని పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కించాలని దర్శకుడు దేవకట్టా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.
రాజకీయ, పోలీసు, న్యాయ వ్యవస్థలో ఏదో ఒక అంశంపై రిపబ్లిక్ రెండో భాగం ఉంటుందని దేవకట్టా స్పష్టం చేశారు. రిపబ్లిక్‌తో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం వల్ల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జీ5 ఓటీటీ సంస్థ విజయోత్సవ వేడుకలకు నిర్వహించింది. దర్శకుడు దేవకట్టాతోపాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిర్మాత నిహారిక హాజరై కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచున్నారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ రెండో భాగంపై స్పష్టత ఇచ్చారు దేవకట్టా. మరో రెండు నెలల్లో రిపబ్లిక్ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Republic movie review: 'రిపబ్లిక్' మూవీ రివ్యూ