పాప్‌స్టార్ మైకేల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టి, రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన బాబా జాక్సన్ మీకు గుర్తున్నాడా? లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు గుర్తు చేసుకోండి. ఎందుకంటే అతడు ఇటీవలే ఓ రియాలిటీ షోలో పాల్గొని, ఏకంగా కోటి రూపాయలు గెల్చుకున్నాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించడం విశేషం.
-
India’s first #entertainerno1 is #babajackson @Flipkart. He has won 1 cr rs . Congratulations baba Jackson pic.twitter.com/QJkjhuFiHw
— Varun Dhawan (@Varun_dvn) June 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">India’s first #entertainerno1 is #babajackson @Flipkart. He has won 1 cr rs . Congratulations baba Jackson pic.twitter.com/QJkjhuFiHw
— Varun Dhawan (@Varun_dvn) June 7, 2020India’s first #entertainerno1 is #babajackson @Flipkart. He has won 1 cr rs . Congratulations baba Jackson pic.twitter.com/QJkjhuFiHw
— Varun Dhawan (@Varun_dvn) June 7, 2020
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్, లాక్డౌన్ వేళ 'ఎంటర్టైనర్ నంబర్.1' పేరుతో ఓ వర్చువల్ రియాలిటీ షోను నిర్వహించింది. కథానాయకుడు వరుణ్ ధావన్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మొత్తంగా ఎనిమిది వారాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో చివరివరకు నిలిచిన యువరాజ్ సింగ్ అలియాస్ బాబా జాక్సన్.. కోటి రూపాయలు సొంతం చేసుకున్నాడు.
ఇప్పటికే బాబా జాక్సన్ వీడియోలను చూసిన హృతిక్ రోషన్, టైగర్‌ష్రాఫ్, వరుణ్ ధావన్ తదితరులు అతడి డ్యాన్స్‌ను మెచ్చుకున్నారు. ఇతడి తండ్రి జోధ్‌పుర్‌లో టైల్స్ అమర్చే పనిలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు జాక్సన్.. భారీ మొత్తం గెలుచుకోవడం వల్ల ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇవీ చదవండి: