ఇస్మార్ట్ శంకర్ రామ్.. కొత్త సినిమా 'రెడ్' లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో బుధవారం పూజా కార్యక్రమం జరిగింది. జెమిని కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి క్లాప్ కొట్టారు. వచ్చే నెల 16 నుంచి షూటింగ్ మొదలుకానుంది.
ఇప్పటికే విడుదలైన రామ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరోసారి మాస్ పాత్రలో అలరించనున్నాడు. తమిళ హిట్ 'తడమ్' రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇంతకు ముందు రామ్‌తో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు తీశాడీ డైరక్టర్.
ఇది చదవండి: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమా ప్రారంభం