'ఆర్‌ఎక్స్ 100'తో అలరించిన కథానాయిక పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా.. తేజస్ కంచెర్ల హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్డీఎక్స్ లవ్'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"వేటాడాలనుకున్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించొచ్చు. అదే వేటాడాలనుకున్న ఆడపిల్లకి సింహం కూడా కుక్కపిల్లలా కనిపిస్తుంది" అంటూ పాయల్ పలికే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.
శంకర్ భాను దర్శకత్వంలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రధన్ సంగీతం అందిస్తున్నాడు. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, నాగినీడు, ఆదిత్య మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం.