ETV Bharat / sitara

RC 15: రామ్​చరణ్​ కొత్త సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్స్​ - మూవీ న్యూస్

రామ్​చరణ్​-శంకర్​ సినిమాకు సంగీత దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి రికార్డింగ్​ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే దాదాపు 18 తర్వాత శంకర్​తో తమన్ కలిసి పనిచేస్తుండటం ఆసక్తికరంగా కనిపిస్తోంది.

Rc 15
ఆర్​సీ 15
author img

By

Published : Jul 19, 2021, 12:13 PM IST

Updated : Jul 19, 2021, 2:06 PM IST

మెగాపవర్​స్టార్​ రామ్​చరణ్​-దర్శకుడు శంకర్​ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న సినిమాకు సంగీత దర్శకుడు ఖరారు చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి తమన్​ స్వరాలు సమకూర్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 135 మంది మ్యూజిషియన్లతో కలిసి తమన్​ తొలి రికార్డింగ్​ పూర్తి చేసినట్లు వెల్లడించింది.

Rc 15
ఆర్​సీ 15
Rc 15
ఆర్​సీ 15

ఈ సినిమా కోసం మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, జానీ మాస్టర్​​ను ప్రధాన కొరియోగ్రాఫర్ ఇప్పటికే ఎంపిక చేశారు. కియారా అడ్వాణీని హీరోయిన్​గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. భారీ బడ్జెట్​తో రూపొందే ఈ చిత్రం.. రాజకీయ నేఫథ్య కథతో తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్​ ప్రారంభం కానుంది. దిల్​రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Rc 15
ఆర్​సీ 15

18 ఏళ్ల తర్వాత శంకర్​తో తమన్

సంగీత దర్శకుడు కాకముందే తమన్​ ఓ సినిమా చేశారు. అది కూడా ప్రముఖ దర్శకుడు శంకర్​. 'బాయ్స్'(2003) చిత్రంలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరిగా నటించారు తమన్. ఆ తర్వాత మ్యూజిక్​ను కెరీర్​గా ఎంచుకుని, దక్షిణాది టాప్ సంగీత దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు రామ్​చరణ్​ సినిమాకు పనిచేస్తున్నారు. దీంతో 18 ఏళ్ల తర్వాత శంకర్​తో మళ్లీ కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ చూడండి: Ramcharan-Shankar: రామ్​చరణ్ రచ్చ.. వచ్చే నెల నుంచి!

Last Updated : Jul 19, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.