మాస్ మహారాజా రవితేజ జోరు చూపిస్తున్నారు. 'క్రాక్'లో నటిస్తున్న ఈయన.. కొత్త సినిమాలో పవన్ స్టైల్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు మారుతి తీయబోయే చిత్రంలో న్యాయవాదిగా కనిపించనున్నారని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
దీనితో పాటే డైరెక్టర్లు రమేశ్ వర్మ, త్రినాథరావు నక్కిన కథలకు ఓకే చెప్పారు రవితేజ. వీటి షూటింగ్ పూర్తయిన తర్వాతే మారుతి ప్రాజెక్టు మొదలయ్యే అవకాశముంది.