నటన.. దర్శకత్వం.. రెండు విభాగాల్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు రవిబాబు. విభిన్న సినిమాలతో ఆకట్టుకునే ఈ దర్శక నటుడు.. చిత్ర బడ్జెట్ కంటే కాలమే విలువైందని అంటున్నాడు. ఆయన తాజా చిత్రం 'ఆవిరి' ప్రచారంలో భాగంగా ఓ ముఖాముఖీలో ఈ విషయాన్ని చెప్పాడు.
"నా మొదటి చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్‌తో కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేశాను. 'అవును' సినిమాను సింగిల్షిప్ట్లో పనిచేసి 32 రోజుల్లోనే తీశాను. ఫిల్మ్ మేకింగ్‌లో బడ్జెట్ కంటే కాలానికే విలువనిస్తాను. అందరి కంటే విభిన్నంగా తీస్తాననే నమ్మకమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఆ నమ్మకమే పోయిన రోజున సినిమాలు తీయడమే మానేస్తా." -రవిబాబు, దర్శకనటుడు.
దిల్ రాజు సమర్పిస్తున్న ఆవిరి సినిమాను తెరకెక్కించాడు రవిబాబు. ఇందులో తానూ ఓ కీలక పాత్రలో నటించాడు. హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నవంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: చిరంజీవే భయమంటే.. పాములు తెచ్చారు: మీనా