ETV Bharat / sitara

వైద్యులపై దాడులను మానుకోవాలి:రవీనా - వైద్యులపై దాడులను నిరసిస్తున్న రవీనా టాండన్​

కరోనా సంక్షోభంలో సేవలందిస్తున్న వైద్యులపై దాడులకుగానూ సామాజిక మాధ్యమాల్లో నిరసన చేపట్టారు ప్రముఖ నటి రవీనా టాండన్​. కరోనాపై పోరాటంలో వైద్యులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవ చేస్తున్నారని.. వారికి తగిన సహకారం అందించాలని ఆమె కోరారు.

Raveena Tandon starts campaign to stop attacks on medics
వైద్యులపై దాడులను నిరసిస్తున్న ప్రముఖ నటి
author img

By

Published : Apr 25, 2020, 12:52 PM IST

దేశంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రముఖ నటి రవీనా టాండన్​ సామాజిక మాధ్యమాల్లో నిరసన చేపట్టింది. 'జీతేగా ఇండియా జీతేంగే హమ్'​ (ఇండియా గెలుస్తుంది మనం గెలుస్తాం) అనే హాష్​ట్యాగ్​తో కరోనాపై పోరాడుతున్న వారిపై దాడులు మానుకోవాలంటూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

"కరోనాపై పోరాటంలో మనల్ని ముందుండి నడిపిస్తున్న హీరోలకు మనం మద్దతుగా నిలవడం ఎంతో ముఖ్యం. వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ మన కుటుంబాలను కాపాడుతున్నారు. అందువల్ల వైద్య సిబ్బందికి మన వంతు గౌరవం అందించడం సహా తప్పుడు సమాచారాలను చేరవేయడం మానుకోవాలి. ఈ మార్పు మనకు త్వరలోనే కనిపిస్తుందని ఆశిస్తున్నా" అని రవీనా టాండన్​ వెల్లడించింది.

ఇదీ చూడండి.. కళ్లజోడుతో క్లాస్​గా కనిపించే ఊరమాస్​ డైరెక్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.