కరోనా దెబ్బకు 'వర్క్ ఫ్రం హోమ్'కి బాగా డిమాండ్ పెరిగింది. అయితే ఎప్పుడూ ఔట్ డోర్ షూటింగ్‌లు, ఎండల్లో చిత్రీకరణలేనా మాకూ 'షూటింగ్ ఫ్రం హోమ్' కావాలని భావించింది నటి రవీనా టాండన్. అనుకున్నదే తడవుగా ముంబయిలోని తన ఇంట్లోనే ఓ యాడ్ చిత్రీకరణలో పాల్గొంది. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇద్దరు సిబ్బందితోనే చిత్రీకరణ మొత్తం పూర్తిచేసినట్లు నటి తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
" కరోనా లాక్డౌన్ తర్వాత పనిచేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. పరిమిత సిబ్బందితో తక్కువ సమయంలో చిత్రీకరణ పూర్తయింది. కెమెరామెన్, సౌండ్ రికార్టిస్ట్తోనే మొత్తం షూట్ పూర్తయింది. వాళ్లు పీపీఈ కిట్లు ధరించి ఇంటికి వచ్చారు. ముందుగా శానిటైజేషన్ చేశాం. భౌతిక దూరంతోనే చిత్రీకరణలో పాల్గొన్నా"
-- రవీనా టాండన్, బాలీవుడ్ నటి
రవీనా కేజీఎఫ్ చాప్టర్-2లోనూ పనిచేస్తోంది. ఇందులో యశ్ పక్కన కీలకపాత్రలో కనువిందు చేయనుంది. 25 ఏళ్ల ఈ భామ రామికా సేన్‌గా కనిపించనున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. మరో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అధీరాగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోమ్‌బాలే ఫిల్మ్స్ తెరకెక్కించగా.. ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఏడాది విడుదల కానుంది.
